రాయతీ ధరకే ఉల్లి.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.!

Publish Date:Sep 5, 2026

Advertisement

రాష్ట్రంలో  పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో సామాన్యుల కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధర సామాన్యుడి కిచెన్ లో మంట పెట్టకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య  భాగస్వామ్యంతో   ఉల్లిని రాయతీ  ధరకు వినియోగదారులకు అందించేందుకు   ఏర్పాట్లు  చేసింది.  సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ  కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంది.  పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత జరిగిన ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న నిత్యావసరాల ధరల పరిస్థితి, వాటి పెరుగుదలకు దారితీసిన వివిధ అంశాలపై ఈ సమావేశం చర్చించింది.  త్వరలో రానున్న పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులపై  అదనపు ఆర్థిక భారం పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని  సమావేశం నిర్ణయించింది.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లు,  అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న విక్రయ కేంద్రాల ద్వారా కిలో ఉల్లి 35  రూపాయలకే ప్రజలకు అందించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.  

దీనివల్ల  మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలకు భారీ ఊరట లభిస్తుంది. అలాగే  ఉల్లితో పాటు ఇతర  నిత్యావసర సరుకులైన కందిపప్పు, పామాయిల్ ధరలను కూడా అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది.  మార్కెట్ ధరతో పోలిస్తే పామాయిల్‌ను లీటరుకు  10 రూపాయల వరకు తక్కువ  అందించాలని సబ్ కమిటీ భేటీలో మంత్రులు నిర్ణయించారు. అలాగే కందిపప్పు కొరతను నివారించేందుకు, ధరలను తగ్గించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి దాదాపు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులను కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని తీర్మానించారు. ఈ కేటాయింపులు రాగానే వాటిని ప్రాసెసింగ్ చేసి, రైతు బజార్ల ద్వారా రాయితీ రేట్లకు ప్రజలకు పంపిణీ చేయనున్నారు.  

గత కొంతకాలంగా రాష్ట్రంలో బియ్యం ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రత్యేక కౌంటర్లు,  రైతు బజార్ల ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం విక్రయిస్తుండగా, ప్రజల నుంచి మంచి  స్పందన లభిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి తోడు నెల్లూరు ప్రాంతంలోని రైస్ మిల్లర్ల నుంచి పది వేల టన్నుల కేఎన్‌ఎం రకం బియ్యాన్ని సేకరించి ఈ  కౌంటర్ల ద్వారానే మరింత మందికి అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.   


[AP Government Price Control, Onions at Rs 35 in Rythu Bazaars, Nadendla Manohar, AP Essential Commodities Subsidy, NCCF Onions Andhra Pradesh, Telugu One]

By
en-us Political News

  
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.